: కాపు సామాజిక వ‌ర్గాన్ని భ‌య‌భ్రాంతులకు గురి చేస్తున్నారు: శైలజానాథ్


కాపునేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆసుప‌త్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తోన్న నేప‌థ్యంలో మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ స్పందించారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న ఈరోజు మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కాపు వ‌ర్గాన్ని భ‌య‌భ్రాంతులకు గురి చేస్తోంద‌ని ఆరోపించారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని, దానికోసం ముద్ర‌గ‌డ అంగీకరించి దీక్ష విర‌మించుకోవాల‌ని మంత్రి నారాయ‌ణ వ్యాఖ్య‌లు చేయ‌డం బ్లాక్ మెయిలింగ్‌కు గురి చేయ‌డ‌మేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కాలేజీలు చేస్తున్న ఫీజుల వ‌సూళ్లకు, ఆ విషయంలో స‌ర్కార్ చెబుతున్న లెక్కలకు చాలా తేడా కనపడుతోందని శైల‌జానాథ్ ఆరోపించారు. కార్పొరేట్ కాలేజీల సీట్ల అంశంపై మంత్రి నారాయణ విచారణకు ఒప్పుకుంటారా..? అని ఆయన సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News