: గ్లోవ్స్ తీసేసి బాల్ పట్టనున్న కెప్టెన్ కూల్... జింబాబ్వేలో బాల్ తో చెమటోడ్చిన మహేంద్రుడు


గతంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆతిథ్య జట్టుతో జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ లో చేతులకున్న గ్లోవ్స్ తీసి బంతిని చేతబట్టి బౌలింగ్ చేసిన అరుదైన దృశ్యం ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అలాంటి దృశ్యమే మరోమారు మన కళ్ల ముందు సాక్షాత్కరించనుందా? అంటే అవుననే అంటోంది... జింబాబ్వేలో టీమిండియా జట్టు ప్రాక్టీస్ కు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియో. నిన్న హరారే స్టేడియంలో చేతులకు గ్లోవ్స్ లేకుండా మైదానంలోకి వచ్చిన ధోనీ.. బాల్ తీసుకుని మీడియం ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ సిరీస్ గా భావిస్తున్న ఈ సిరీస్ లో సమయం చూసుకుని ధోనీ బౌలింగ్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News