: అమిత్ షా వ్యాఖ్యలపై ఈటల ఫైర్... తప్పుడు లెక్కలు చూపారంటూ ఆరోపణలు
నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిన్న భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని ఇంకా ఏం చెయ్యాలో చెప్పాలంటూ ఈటల సవాల్ విసిరారు. సూర్యాపేట సభలో అమిత్ షా తప్పుడు లెక్కలు చూపారని ఈటల ఆరోపించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను మోదీ ప్రశంసిస్తుంటే.. అమిత్ షా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పథకాలని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన ఉద్ఘాటించారు.