: సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ ప్రేయసి చక్కర్లు... సహజీవనమేనంటూ వదంతులు


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు వయసైపోతోంది, పెళ్లెప్పుడు చేసుకుంటారన్న విమర్శలకు ఇటీవల చెక్ పడిపోయింది. రొమేనియాకు చెందిన నటి లూలియా వంటూర్ తో జతకట్టిన అతడు ఆమెనే వివాహం చేసుకోవడం ఖాయమన్న వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెళ్లెప్పుడన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా ఓ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి ముందే లూలియాతో సల్మాన్ సహజీవనం సాగిస్తున్నాడని బాలీవుడ్ గాపిస్ వెబ్ సైట్లు వార్తలు రాస్తున్నాయి. ఇందుకు ఓ పక్కా ఆధారం కూడా ఉందంటూ ‘బాలీవుడ్ లైఫ్. కామ్’తో పాటు ఆ వెబ్ సైట్ కథనాలనే ఆధారం చేసుకున్న ‘డీఎన్ఏ’ వెబ్ సైట్ కూడా ఆసక్తికర కథనాలు రాసింది. ముంబైలో సల్మాన్ నివాసముండే ‘గెలాక్సీ అపార్ట్ మెంట్స్’ వద్ద ఇటీవల లూలియా చక్కర్లు కొడుతోందట. సదరు అపార్ట్ మెంట్ బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ఓ సెల్పీని లూలియా ఇటీవల తన ‘ఇన్ స్టాగ్రాం’లో పోస్ట్ చేసింది. సదరు ఫొటోను ఆధారంగా చూపుతూ వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారని ఆ వెబ్ సైట్లు కథనాలను రాశాయి.

  • Loading...

More Telugu News