: సెమీ ఫైనల్‌లో సైనా విజయం.. పైన‌ల్‌కు దూసుకెళ్లిన భార‌త స్టార్ ష‌ట్ల‌ర్‌


ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ లో స్టార్ షట్ల‌ర్‌ సైనా నెహ్వాల్ భార‌త అభిమానుల ఆశ‌ల్ని నిల‌బెట్టింది. నిన్న‌టి క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింగిల్స్ విభాగంలో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ పై గెలుపొంది సెమీ ఫైన‌ల్‌కి చేరిన సైనా నెహ్వాల్.. నేటి సెమీ ఫైన‌ల్లోనూ విజ‌యం సాధించింది. 21-8, 21-12 వ‌ర‌స సెట్ల‌ తేడాతో సెమీస్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్‌-2 షట్ల‌ర్ వాంగ్‌పై సైనా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. మ‌రోవైపు పురుషుల విభాగంలో సెమీ ఫైన‌ల్లో కిదాంబి శ్రీకాంత్‌ ఓట‌మి పాల‌యిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News