: ముద్రగడ దీక్ష నేపథ్యంలో హైదరాబాద్‌లో చిరంజీవిని కలిసిన సి.రామచంద్రయ్య
కాపునేత ముద్రగడ పద్మనాభం దీక్ష, అరెస్టు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవిని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష సభ్యుడు సి.రామచంద్రయ్య ఈరోజు హైదరాబాద్‌లో కలిశారు. ముద్రగడ తనను పోలీసులు అరెస్టు చేసిన తరువాత కూడా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాము అనుసరించాల్సిన అంశాలపై చిరంజీవితో సి.రామచంద్రయ్య చర్చించినట్లు తెలుస్తోంది. ముద్రగడ దీక్షకు దిగేముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేతలని కలసి తమకు మద్దతు తెలపాలని కోరారు. ఈ క్రమంలో కాపుల అంశంపై తాము స్పందించాల్సిన తీరుతెన్నులపై ప్రతిపక్ష నేతలు కసరత్తు చేస్తున్నారు.