: సంకట స్థితిలో భారత్... మోకాలొడ్డిన చైనాపై నోరెత్తలేని వైనం


అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి కూటమిలోని దాదాపు అన్ని దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే పొరుగు దేశం చైనా మాత్రం మోకాలొడ్డింది. నిన్న వియన్నాలో జరిగిన కూటమి భేటీలో తనదైన శైలిలో వాదన వినిపించిన చైనా... భారత దరఖాస్తును పెండింగ్ లో పెట్టించింది. చైనాతో పాటు మరో మూడు దేశాలు మాత్రమే భారత సభ్యత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాయి. అగ్రరాజ్యం అమెరికా సహా 38 దేశాలు సరేనన్నా భారత్ కు సభ్యత్వం దక్కలేదు. ఈ నేపథ్యంలో తన సభ్యత్వానికి మోకాలొడ్డిన చైనాపై భారత్ విరుచుకుపడాల్సిందే. బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిందే. అయితే చైనాను నోరెత్తి ఒక్క మాట కూడా అనలేని సంకట స్థితిలో భారత్ పడిపోయింది. ఎందుకంటే... భారత దరఖాస్తును ఎన్ఎస్జీ కూటమి పూర్తిగా తిరస్కరించలేదు. ఎన్పీటీపై సంతకం చేయని దేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం ఎలా ఇస్తామని చైనా వాదించింది. ఈ క్రమంలో ఈ నెల 20న దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో జరగనున్న తదుపరి భేటీలో భారత్ దరఖాస్తుపై చర్చకు కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో జరిపిన చర్చల మాదిరిగానే చైనాతోనూ భారత్ చర్చలు జరిపేందుకు అవకాశం చిక్కింది. ఈ నేపథ్యంలో తన సభ్యత్వానికి మోకాలొడ్డిన చైనాపై భారత్ ఆగ్రహంలో మగ్గిపోతున్నా ఆ దేశంపై పల్లెత్తు మాట కూడా అనడం లేదు.

  • Loading...

More Telugu News