: రేపటి నుంచి ఏపీ ఉద్యోగుల బదిలీలు... ప్రకటన విడుదల


రేపటి నుంచి అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం కానున్నాయి. అమరావతి నుంచి పరిపాలన కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల 28 నాటికి ఉద్యోగులంతా ఏపీకి తరలాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచే ఏపీకి ఉద్యోగుల బదిలీలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు బదిలీలు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులంతా ఏపీకి తరలాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదేళ్లు ఒకేచోట పని చేసినవారంతా కదలాల్సిందేనని పేర్కొంది. అయితే, బదిలీకి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించింది. రుతుపవనాలు వచ్చేయడంతో వ్యవసాయ శాఖలో బదిలీలు ఉండవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News