: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడ్ని చంపిన వారికి 2.9 కోట్ల రూపాయలిస్తాం: డ్రగ్ మాఫియా ప్రకటన


ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ కు, డ్రగ్ మాఫియాకు మధ్య యుద్ధం జరుగుతోంది. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, 'దేశాన్ని నాశనం చేస్తున్న డ్రగ్ డీలర్లు కనిపిస్తే చంపేయండి, నేను చూసుకుంటా'నంటూ ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతే స్థాయిలో డ్రగ్ మాఫియా కూడా స్పందించింది. దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ ను చంపిన వారికి మూడు లక్షల యూరోలు (సుమారు 2.9 కోట్ల రూపాయలు) బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. గతంలో కూడా ఇలాంటి ఆఫర్నే ప్రకటించిన డ్రగ్ మాఫియా రోడ్రిగోను చంపిన వారికి 1.5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. దీనికి పెద్దగా స్పందన రాకపోవడంతో ప్రైజ్‌ మనీని భారీగా పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News