: బాయ్ ప్రెండ్ చేసిన మోసం... బాలీవుడ్ నటిని రోడ్డు పాలు చేసింది!
అలీషా ఖాన్... ఢిల్లీకి చెందిన మోడల్. తదుపరి మజిలీ బాలీవుడ్...ఈ మజిలీని కూడా ఆమె అవలీలగానే దాటేసింది. 'మై హజ్బెండ్స్ వైఫ్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. 12 వీడియో ఆల్బమ్స్ లో కూడా నటించింది. ఇందులో మీకా సింగ్ వీడియో సాంగ్ కూడా ఉండడం విశేషం. వీటిని ఆలంబనగా చేసుకుని బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీ సరసన 'ఐనా' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా పూర్తయింది కూడా. ఈ క్రమంలో ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. ఈ వ్యక్తి వారిద్దరూ వ్యక్తిగతంగా గడిపిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్ లో పెట్టాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అలీషా ఖాన్, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఉన్నత కుటుంబానికి చెందిన అలీషా, ఈ విషయంలో తన కుటుంబ సభ్యుల మద్దతు దొరుకుతుందని ఆశించింది. 'మా పరువు తీశావు కదే' అంటూ ఆమె సోదరుడు, తల్లి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఇప్పుడామె నీడలేనిదైపోయింది. ప్రస్తుతం పార్కులు, గుళ్లలో పడుకుని కాలం వెళ్లదీస్తోంది. అప్పుడప్పుడు స్నేహితుల సాయం తీసుకుంటున్నా.... ఇలా ఎంతకాలం? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కష్టాలకు తోడు యాక్సిడెంట్ అయిందని వాపోయింది. 'ఐనా' సినిమా ఆగస్టులో విడుదల కానుంది.