: మహారాష్ట్రలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ని ఉతికేసిన విద్యార్థినులు!
మహారాష్ట్రలోని వసంత్ రామ్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ ని విద్యార్థినులు చితక్కొట్టారు. ప్రొఫెసర్ శరద్ 'వసంత్ రామ్ మెడికల్ కాలేజి'లో పాఠాలు బోధిస్తారు. అయితే ఆయనకు అమ్మాయిలతో ఆడుకోవడం సరదాగా మారింది. ఈ విషయంలో ఆయనకు విద్యార్థులు, నర్సులు, రోగులు అన్న తేడా లేదు. ఎదురుగా ఉన్నది మహిళ అయితే చాలు! ఈ క్రమంలో ఓ స్టూడెంట్ మెడికల్ సర్టిఫికేట్ కావాలంటూ ప్రొఫెసర్ వద్దకు వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రొఫెసర్, ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం ప్రారంభించాడు. అనంతరం మెడికల్ సర్టిఫికేట్ ఇస్తాను రావాలంటూ విద్యార్థినికి మెసేజ్ పెట్టాడు. సర్టిఫికేట్ కోసం వెళ్లిన విద్యార్థినిని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటూ శరీరమంతా తాకడం ప్రారంభించాడు. దీనిపై నిలదీయడంతో ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో బాధిత స్టూడెంట్ తన తరగతికి వెళ్లి స్నేహితులకు విషయం వివరించింది. అంతే, అప్పటికే వారిలో బాధితులు చాలా మంది ఉండడంతో వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. కళాశాల రెస్ట్ రూం దగ్గర ప్రొఫెసర్ ను పట్టుకున్న విద్యార్థినులు అతనిని పట్టుకుని చితక్కొట్టారు. కాలితో తన్నారు. నొటికొచ్చిన బూతులన్నీ తిట్టారు. అనంతరం అతనిపై కేసు పెట్టారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.