: ముద్రగడ కాపులపై ద్వేషాన్ని పెంచుతున్నారు: కిమిడి కళావెంకట్రావు


ముద్రగడ పద్మనాభం కాపులపై ద్వేషాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. మంగళగిరిలో కాపు సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ ప్రతి పది రోజులకు ఒకసారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాపులకు రిజర్వేషన్ లు కల్పించాలంటే అందుకు సాంకేతిక అవరోధాలు అధిగమించాలని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం అదే పనిలో ఉందని ఆయన చెప్పారు. అలాంటి సమయంలో ముద్రగడ పదిరోజులకు ఒకసారి ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారని, ఆయన కారణంగా రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలన్నీ కాపులను వ్యతిరేకించే పరిస్థితి నెలకొంటుందని ఆయన తెలిపారు. ఇది కాపులకు ప్రమాదమని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News