: 'బాండిట్ క్వీన్'కి చాలా పోరాటం చేశాను... మీరూ పోరాడండి: శేఖర్ కపూర్


బాలీవుడ్ ఫిలిం మేకర్ శేఖర్ కపూర్ 'ఉడ్తా పంజాబ్' సినిమాకు మద్దతు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టిన శేఖర్ కపూర్ గతాన్ని గుర్తు చేస్తూ 'ఉడ్తా పంజాబ్' సినిమా యూనిట్ లో స్పూర్తి నింపారు. మీ సినిమాపై మీకు పూర్తి నమ్మకం ఉంటే పోరాటానికి వెనుకాడవద్దని సూచించారు. గతంలో తాను కూడా 'బాండిట్ క్వీన్' సినిమా విడుదలకు సుప్రీంకోర్టులో పోరాటం చేశానని గుర్తు చేశారు. పోరాటం తరువాతే ఆ సినిమా విడుదలైందని, చక్కని ఆదరణ పొందిందని ఆయన తెలిపారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ట్వీట్ చేస్తూ 'ఉడ్తా పంజాబ్'కు మద్దతు తెలిపాడు. 'టామీ సింగ్' (షాహిద్ కపూర్ పాత్ర పేరు) వెనుక తామంతా ఉన్నామని, పోరాటం ఆపొద్దని కోరాడు.

  • Loading...

More Telugu News