: ముద్రగడ అనుకూల.. వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన కాపు సంఘాలు!
కాపులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కాపుల్లో చిచ్చుపెట్టింది. కాపులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి ముద్రగడ అనుకూల, రెండు ముద్రగడ వ్యతిరేక వర్గాలుగా కాపులు విడిపోయారు. వీటిని ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పలువురు పేర్కొంటున్నారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా కాపు ఉద్యమ నేతలు విజయవాడలో సమావేశం నిర్వహించగా, మంగళగిరిలో ముద్రగడ వ్యతిరేక కాపు వర్గం సమావేశం నిర్వహించింది. దీంతో ముద్రగడను అరెస్టు చేయడంలో నైతికతను పలువురు కాపు నేతలు ప్రశ్నిస్తుండగా, రెండో వర్గం ప్రభుత్వ అరెస్టులకు అడ్డుపడడం న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక మలుపులు ఎటువైపుకు దారితీయనున్నాయోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.