: ఉస్మానియా లేడీస్ హాస్టల్ వద్ద ఆందోళన
హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఉస్మానియా మహిళల వసతి గృహాలకు రక్షణ లేకుండా పోతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ లో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. అలాగే యూనివర్సిటీ హాస్టల్ లో నాసిరకమైన భోజనం పెడుతున్నారని, దానిని తినలేకపోతున్నామని వారు చెప్పారు. తమకు మంచి భోజన సౌకర్యం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.