: రేపు కృష్ణా జిల్లా బంద్... కాపునాడు పిలుపు
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ ను నిరసిస్తూ రేపు కృష్ణా జిల్లా బంద్ కు కాపునాడు పిలుపునిచ్చింది. తుని ఘటనకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టవద్దని, ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. నవనిర్మాణ దీక్షల్లో కాపు మంత్రులపై సీఎం చంద్రబాబు వివక్ష చూపారని కృష్ణా జిల్లా కాపునాడు ఆరోపించింది.