: ఇల్లు మారితే ఎలా అయితే వసతులు సమకూర్చుకుంటామో, ఇప్పుడూ అలాగే సమకూర్చుకోవాలి: సీఎం చంద్రబాబు


ఇల్లు మారితే ఎలా అయితే వసతులు సమకూర్చుకుంటామో, ఇప్పుడు కూడా అలాగే సమకూర్చుకోవాలని హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి ఉద్యోగుల తరలింపు విషయంలో కొన్నిరోజుల పాటు వెసులుబాటు కల్పించాలని కోరుతూ చంద్రబాబును హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదని, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున అమరావతికి రావాల్సిందేనని చెప్పారు. ఉద్యోగులు అనవసర వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వానికి సహకరించాలని, సమస్యలు ఏమైనా ఉంటే స్వయంగా తననే సంప్రదించాలని, ఉద్యోగుల తరలింపు విషయంలో ఎవరినో కలిస్తే ప్రయోజనం ఉండదని, ఎవరినో కలిసి తరలింపుపై అనవసర వివాదాలు సృష్టించవద్దని వారికి చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News