: కాపులను రోడ్కెక్కిస్తున్న జగన్: టీడీపీ నేత కళా వెంకట్రావు ఆరోపణ
కాపు సంఘాల సమాఖ్య ఆత్మీయ సమావేశం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు 'హ్యాపీ రిసార్టు'లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, టీడీపీ నాయకులు సాంబశివరావు, విజయవాడ మాజీ మేయర్ శకుంతల, సీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, ఇతర కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, కాపులను సామాజికంగా అభివృద్ధికి చేయడానికి బదులు వారిని రోడ్డెక్కించేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కుట్ర పన్నారని, గతంలో వేసిన కమిషన్లు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన విమర్శించారు. బీసీల అభివృద్ధి కోసమే ప్రస్తుతం చంద్రబాబు మంజునాథ కమిషన్ వేశారని, ఎన్నికల్లో ప్రకటించిన విధంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని అన్నారు.