: సెమీస్కు దూసుకెళ్లిన సైనా, శ్రీకాంత్
భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. సింగిల్స్ విభాగాల్లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా, శ్రీకాంత్ అద్భుతంగా రాణించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ తో హోరాహోరీగా జరిగిన పోరులో సైనా 28-16, 21-16 వరుస సెట్లతో గెలుపొంది విజయ ఢంకా మోగించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కొరియా షట్లర్ వాంగ్‌పై 21-18, 21-17 తో శ్రీకాంత్ గెలుపొందాడు.