: సుల్తాన్ గా అల్లు అర్జున్, సుల్తానాగా స్నేహా రెడ్డి!


'సరైనోడు' చిత్రం అందించిన విజయంతో అల్లు అర్జున్ ఉత్సాహంలో ఉన్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య, కుమారుడు, స్నేహితులతో కలిసి జమ్మూకాశ్మీర్ వెళ్లిన స్టైలిష్ స్టార్. అక్కడి నుంచి టర్కీకి వెళ్లాడు. సెలవులను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ తన అభిమానులను పలకరిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా తమ ఆనందకరమైన సన్నివేశాలను ఫోటోల రూపంలో పెడుతూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా టర్కీలో ఉన్న అల్లు అర్జున్ దంపతులు... అక్కడి బ్లూమాస్క్ ను సందర్శించారు. అక్కడ స్థానికంగా లభ్యమయ్యే చక్రవర్తి, రాణి దుస్తులను వీరు కూడా ధరించి ఫోటోలు దిగారు. అనంతరం ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుల్తాన్ గా అల్లు అర్జున్, సుల్తానాగా స్నేహా రెడ్డి అభిమానులను అలరిస్తున్నారు.

  • Loading...

More Telugu News