: మీడియా గొంతు నొక్కారు: చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం
తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాపునేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయడం పట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ అరెస్టు కుట్ర పూరితంగా జరిగిందని ఆరోపించారు. తలుపులు పగలకొట్టి, చిత్రహింసలు చేసి ముద్రగడను అరెస్టు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల్లో ఏవీ నెరవేర్చలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. కాపులను బీసీల్లో చేరిస్తే తాను చంద్రబాబు కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటానని అన్నారు. ప్రభుత్వ అక్రమాలను చూపెట్టే ఛానళ్లను కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ‘ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.