: ఎర్రవల్లిలో నిరుద్యోగులకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఉపాధిలేని యువకులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు 3.36 కోట్ల రూపాయలు ఖర్చుచేసి, 42 ట్రాక్టర్లు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఈ రెండు గ్రామాల్లోని నిరుద్యోగులను, ట్రాక్టరు డ్రైవర్లుగా పని చేస్తున్న యువకులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఐదు గ్రామాలను 14 జోన్లుగా విభజించి, ఒక్కోజోన్ కు లోతుగా మట్టిని దున్నే ట్రాక్టరు, మధ్యస్థంగా దున్నగలిగే ట్రాక్టరు, చిన్నగా దున్నగలిగే ట్రాక్టర్లు.. ఇలా మూడు రకాల ట్రాక్టర్లను వారికి పంపిణీ చేశారు. దీంతో ఈ గ్రామాల్లోని యువకులకు ఉపాధి లభించడమే కాకుండా, వ్యవసాయం పనులు కూడా వేగం పుంజుకుంటాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News