: స్త్రీ వేషంలో ఏడాదిలో 11 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు!
చైనాలో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నిత్యపెళ్లి కొడుకుల గురించి అందరికీ తెలిసిందే. అయితే మియావూ సొంగాటో (27) మాత్రం పురుషుడే స్త్రీ వేషం ధరించి 11 మందిని బోల్తా కొట్టించాడంటే అంతా ఆశ్చర్యపోవాల్సిందే. సొంగాటో నిత్యం మహిళలా అందంగా ముస్తాబై ఆన్ లైన్ లో ఛాటింగ్ కు వచ్చేవాడు. రకరకాల పేర్లతో ఛాటింగ్ చేసే సొంగాటో ప్రొఫైల్ బాగున్న అబ్బాయిలను ఆడగొంతుతో మాయచేసేవాడు. కేవలం వెబ్ ఛాట్ ద్వారా వారిని పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఇలా ఏడాదిలో 11 మంది అబ్బాయిలను ఆడవేషంలో పెళ్లి చేసుకున్నాడంటే ఎంత చాకచక్యంగా మోసం చేశాడో ఊహించుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత రెండు రోజుల పాటు జాగ్రత్తగా మెయింటైన్ చేసే సొంగాటో మూడో రోజు గిఫ్టులు, పెళ్లి వారింట్లో డబ్బులు పట్టుకుని మెల్లిగా చెక్కేసేవాడు. అయితే 11వ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళగా వివాహంలో దర్శనమిచ్చిన సొంగాటో అసలు రంగు బట్టబయలైంది. తాను పురుషుడ్ని పెళ్లి చేసుకున్నానని తెలిసిన పెళ్లి కొడుకుకి ఎలా స్పందించాలో తెలియలేదు. ఇకపోతే అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు, పెద్దఎత్తున స్త్రీలు ఉపయోగించే దుస్తులు, మేకప్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.