: విజయగర్వంతో ఢిల్లీ చేరుకున్న మోదీ... ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు
అణు పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తున్న దేశాల న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం సాధించడమే లక్ష్యంగా ఐదు దేశాల పర్యటన చేసిన భారత ప్రధాని నరేంద్రమోదీ తన పర్యటనను ముగించుకొని ఈరోజు ఢిల్లీలో అడుగు పెట్టారు. న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మోదీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్థాన్ పర్యటనతో మొదలైన ఆయన విదేశీ పర్యటన మెక్సికో ప్రభుత్వ నేతలతో చర్చించడంతో ముగిసింది. మోదీ పర్యటనలో భాగంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై కూడా చర్చించారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్ చేరడానికి మోదీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మోదీ పర్యటన ఫలితంగా ఈ అంశంపై అమెరికాతో పాటు మెక్సికో మద్దతు కూడా భారత్‌కు లభించింది.