: కుట్రలు పన్నడమే జగన్ పనిగా పెట్టుకున్నారు!: ఏపీ మంత్రి దేవినేని


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని జగన్, ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తొలకరి వర్షాలు కురుస్తున్న వేళ రైతుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే, ఇవేవీ జగన్ కు కనపడటం లేదని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రాకుండా జగన్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఆరోపించారు.

  • Loading...

More Telugu News