: జయబాధురిని కాకుంటే...వహీదా రెహ్మాన్ ని చేసుకునే వాడిని: అమితాబ్


బాలీవుడ్ షెహేన్ షా అమితాబ్ బచ్చన్ 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు. తనకు మోడ్రన్ గా ఉండే సంప్రదాయబద్ధమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఉండేదని అన్నారు. ఈ సమయంలోనే జయబాధురి ఫోటోను ఓ కవర్ పేజ్ పై చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యానని చెప్పారు. ఈ విషయంపై జయబాధురి చెబుతూ, 'అలా అని తామిద్దరిదీ 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' కాదని జయబాధురి తెలిపింది. పరిచయం ప్రేమగా మారడానికి చాలా కాలం పట్టిందని చెప్పింది. 1973 జూన్ 3న వివాహం చేసుకున్నారు. ఆ ఏడాది అమితాబ్ నటించిన జంజీర్ సూపర్ సక్సెస్ ను ఇవ్వడమే కాకుండా యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 'షోలే' నిర్మాణంలో ఉండగా, అభిషేక్ కడుపులో పడ్డాడని ఆమె చెప్పింది. జయబాధురిని చేసుకోకపోయి ఉంటే వహీదా రెహ్మాన్ ను వివాహం చేసుకుని ఉండేవాడినని అమితాబ్ చమత్కరించడం విశేషం. మరి రేఖ సంగతేంటో అమితాబ్ చెప్పలేదు.

  • Loading...

More Telugu News