: రైల్వేల్లో ‘వెయిటింగ్ లిస్ట్’కు చెల్లుచీటి!... 2020 నాటికి అందరికీ ‘కన్ఫర్మ్ డ్’ టికెట్లేనట!


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు... రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పారు. ‘ఈటీవీ’ ప్రతినిధికి ఢిల్లీలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన శుభవార్త ఇప్పటికిప్పుడు అందుబాటులోకి రాకున్నా... మరో నాలుగేళ్లు ఆగితే బస్సెక్కినట్టే రైలును ఎక్కేయొచ్చట. అసలు 2020 నాటికి వెయిటింగ్ లిస్ట్ అన్న పదమే వినిపించదని ఆయన చెప్పారు. 2020 నాటికి అమ్ముడవుతున్న టికెట్లు, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యతో సమానంగా ఉంటుందని చెప్పిన ఆయన... ప్రయాణికుల సంఖ్యలో సీట్లుంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కడుంటుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రైల్వే ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో తాము చేపట్టిన చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయని చెప్పిన ప్రభు... 2020 నాటికి వెయిటింగ్ లిస్ట్ అన్నదే ఉండబోదని ప్రకటించారు. టికెట్ కొనుగోలు సమయంలోనే ప్రయాణికులకు బెర్త్ కన్ ఫర్మ్ చేసేస్తామని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News