: స్థానికతపై గ్రీన్ సిగ్నల్ కు కంభంపాటి హర్షం... ఇక ఉద్యోగులు అమరావతికి వచ్చేయాలని వ్యాఖ్య
స్థానికత అంశంపై ప్రధాన అడ్డంకిని తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ఫైళ్లపై సంతకం చేయడం పట్ల ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక ప్రభుత్వోగులు ఏపీకి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ఉద్యోగులు ఇక అమరావతికి వచ్చేయాలని ఆయన అన్నారు. తమ పిల్లల స్థానికతపై ఇక ఆందోళన వద్దని ఆయన అన్నారు. స్థానికతపై ఉద్యోగులకున్న సందేహాలకు నేడు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ సమాధానంగా ఉంటుందన్నారు.