: నిశ్శబ్దంగా ఉండకపోతే చెంపదెబ్బలు పడతాయ్: రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని మౌ వద్ద నియోన్ ఫెర్టిలైజర్ గురించి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తోన్న సమయంలో పలువురు దురుసుగా ప్రవర్తిస్తూ అల్లరి చేయడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు మాట్లాడే సమయంలో మధ్యలో కలగజేసుకోవద్దని రాజ్‌నాథ్ వారికి సూచించారు. నిశ్శబ్దాన్ని పాటించకపోతే చెందెబ్బలు పడతాయని వ్యాఖ్యానించారు. మొదట కేకలు వేయొద్దంటూ రాజ్‌నాథ్ సింగ్ సున్నితంగా హెచ్చరించారు. అయినప్పటికీ ఓ గ్రూపు అదేపనిగా కేకలు వేయడంతో రాజ్‌నాథ్ సింగ్ కు కోపం వచ్చేసింది. దీంతో చెంపలు పగులుతాయ్ అని వారిని గట్టిగా హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌కి తాము సాయం చేసే అంశంలో సానుకూలంగానే వ్యవహరిస్తున్నామని సభలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌లో చెలరేగుతోన్న పలు ఆందోళనలు, ఇటీవలి మధుర వంటి ఘటనలపై ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. భూములన్నీ కబ్జాలయిపోతున్నాయని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు కూడా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.