: పురుగుల మందు పట్టుకొని ముద్రగడ దీక్షకు దిగారు.. ఏం చెయ్యాలో చెప్పండి..?: మంత్రి నారాయణ
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తుని ఘటన కేసుని సీబీఐకి అప్పగించాలంటూ చేసిన డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. ‘ఇంట్లో దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఎలా అవుతోందంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ తన ఇంట్లో చేస్తోన్న దీక్ష తన కుటుంబ సమస్యలపైన కాదు కదా?’ అని ఆయన అన్నారు. ముద్రగడ పురుగుల మందు తాగుతానంటే ప్రభుత్వం ఏం చెయ్యాలి..? అని ఆయన ప్రశ్నించారు. ఇది లా అండ్ ఆర్డర్ సమస్యేనని ఉద్ఘాటించారు. తుని విధ్వంసం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ అంటున్నారని, సీబీఐ విచారణను ఎదుర్కొన్న జగన్ ఉద్దేశపూర్వకంగానే ఈ డిమాండ్ చేస్తున్నారని నారాయణ అన్నారు. సీబీఐ విచారణ అంశాన్ని ఓ సాధారణ అంశంలా చిత్రీకరించాలని జగన్ చూస్తున్నారని ఆయన అన్నారు.