: అప్పు చెల్లించండి మహాప్రభో... ట్రైడెంట్ హోటల్ ముందు పీఎన్బీ సిబ్బంది ఆందోళన
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు పరిధిలోని మాదాపూర్ లో కొద్దిసేపటి క్రితం ఓ వినూత్న నిరసన ప్రారంభమైంది. హోటల్ పెడతామంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి ట్రైడెంట్ హోటల్స్ యాజమాన్యం రూ.800 కోట్ల మేర రుణం తీసుకుందట. రుణం వసూలయ్యే దాకా బ్యాంకర్లతో మంచిగానే ఉన్న హోటల్ యాజమాన్యం... ఆ తర్వాత రుణ వాయిదాలు చెల్లించడం మానేసింది. దీంతో పలు మార్లు బ్యాంకు సిబ్బంది పంపిన నోటీసులకు హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఓపిక నశించిన బ్యాంకు సిబ్బంది ‘రుణం చెల్లించండి మహాప్రభో’ అంటూ హోటల్ ముందు నిరసనకు దిగారు. సాఫ్ట్ వేర్ సంస్థలకు కేంద్రంగా ఉన్న మాదాపూర్ లో జరుగుతున్న ఈ ఆందోళనను అక్కడి జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు.