: భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వానికి ఆదిలో ఎదురు గాలైనా... ప్రస్తుతం సానుకూలం: అంతర్జాతీయ మీడియా కథనాలు


అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత ప్రతిపాదనకు గతంలో పలు ప్రపంచ దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. దక్షిణాసియా దేశాలు అందులోకి ప్రవేశించే విషయంపై ఎన్ఎస్జీ సభ్య దేశాలన్నీ దాదాపుగా ఇష్టపడలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్ఎస్జీలో సభ్య దేశాల్లో మెజారిటీ దేశాలు భారత్ కు... అణు సరఫరా దేశంగా సభ్యత్వమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు ‘రాయిటర్స్’ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు ఆసక్తికర కథనాలను ప్రచురిస్తున్నాయి. గత నెలలో భారత్ దాఖలు చేసిన దరఖాస్తుకు మద్దతు కూడగట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పలు దేశాల అధినేతలతో ఆయన నేరుగా సంభాషించారు. మొన్నటి అమెరికా పర్యటనలో భాగంగా మోదీకి ఆ దేశాధినేత బరాక్ ఒబామా పూర్తిగా మద్దతు ఇచ్చారు. కూటమిలోని కీలక దేశం మెక్సికో కూడా బహిరంగంగా మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే మిగిలిన సభ్య దేశాలన్నీ భారత అభ్యర్థిత్వంపై సానుకూల దృక్పథం అలవరచుకున్నాయంటూ సదరు మీడియా సంస్థలు కథనాలు రాశాయి.

  • Loading...

More Telugu News