: ప్రైవేట్ ట్రావెల్స్ ను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జ్... బెంగళూరు-హైదరాబాదు హైవేపై నిలిచిన రాకపోకలు


అక్రమ మార్గాల్లో సర్కారు ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకాలకు నిరసనగా రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీ విరిగింది. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వానికి పన్నులు కూడా కట్టకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాదు శివారు ప్రాంతం అరాంఘర్ చౌరస్తా వద్ద నేటి ఉదయం ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు. ఫలితంగా అరాంఘర్ చౌరస్తా వద్ద భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. వెరసి హైదరాబాదు-బెంగళూరుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్టీసీ కార్మికులపై లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు.

  • Loading...

More Telugu News