: ఇక రంగంలోకి సీబీఐ!... ‘అగస్టా’, మాల్యా కేసులపై సిట్ ఏర్పాటు!


కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం సహా 17 బ్యాంకులను మోసం చేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులకు సంబంధించిన దర్యాప్తు మరింత ముమ్మరం కానుంది. ఇప్పటిదాకా ఈ రెండు వ్యవహారాలపై కేసు నమోదు చేసిన సీబీఐ... ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు సాగిస్తుండటంతో కాస్తంత వెనక్కు తగ్గింది. అయితే నిన్న సీబీఐ ఈ రెండు కేసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈడీ వెలికితీసిన విషయాలతో పాటు పూర్తి స్థాయిలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ఈ బృందం దర్యాప్తును ముమ్మరం చేయనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News