: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తస్కరణ... వాటిలో కీలక సమాచారం!


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వింగ్ కమాండర్ అధికారిక నివాసంలో ఒక ముఖ్యమైన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ఈరోజు తస్కరణకు గురయ్యాయి. వీటిలో అత్యంత కీలక సమాచారం ఉంది. ఢిల్లీలోని ఐఏఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న ఆ వింగ్ కమాండర్ కు చెందిన ఎయిర్ ఫోర్స్ సెల్యులర్ (ఏఎఫ్సీఈఎల్) మొబైల్ దొంగతనానికి గురైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఐఏఎఫ్ 3జీ సెల్యులర్ నెట్ వర్క్ తో ఈ మొబైల్ కనెక్టయి ఉంటుంది. వింగ్ కమాండర్ ఫిర్యాదు మేరకు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విషయమై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News