: 'ఉడ్తా పంజాబ్'కు మాయావతి మద్దతు


పంజాబ్ డ్రగ్ మాఫియాపై తీసిన 'ఉడ్తా పంజాబ్' చిత్రానికి మద్దతు వెల్లువెత్తుతోంది. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా ఆ సినిమా యూనిట్ ప్రారంభించిన యుద్ధానికి అన్ని వర్గాల నుంచి మద్దతు దొరుకుతోంది. తాజాగా బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయావతి ఈ చిత్రానికి మద్దతు తెలిపారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ, ఆ సినిమాలో తప్పుగా ఏమీ చిత్రీకరించలేదు కదా? అన్నారు. బీఎస్పీ ఈ సినిమాకి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ వాడకం ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందన్నది తెలియజేయడం తప్పుకాదు కదా? అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వాడకంపై కలిగే దుష్ప్రభావాలపై ఈ సినిమా ద్వారా అవగాహన కల్పించడం నేరం కాదు కదా? అని ఆమె అడిగారు. ఈ సినిమాను విడుదల చేయడంలో తప్పేంటో తనకు అర్థం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News