: 'చెన్నై సూపర్ కింగ్స్' శ్రీనివాసన్ కొత్త లీగ్!


బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ క్రికెట్ పై తన మమకారాన్ని కొత్త పద్ధతిలో వ్యక్తం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్ పీఎల్) పేరుతో లోకల్ క్రికెట్ టోర్నీ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తమ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేకుండా ఒక ఐపీఎల్ సీజన్ ముగిసిందని, మరో సీజన్ ముగిస్తే తమ జట్టుపై నిషేధం ముగుస్తుందని, అప్పుడు ఐపీఎల్ లో అడుగుపెడుతుందని అన్నారు. ఈ లోగా జట్టుకు సరైన దేశవాళీ ఆటగాళ్లను అందించేందుకు సరికొత్త లీగ్ ను ప్రవేశపెట్టనున్నామన్నారు. అందుకే, తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్ పీఎల్) పేరుతో లోకల్ క్రికెట్ టోర్నీని ప్రారంభిస్తున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. తమిళనాడు క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన వేదిక ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ టోర్నీకి రూపకల్పన చేసినట్టు ఆయన తెలిపారు. ఇందులో సత్తా చాటిన ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో ఐపీఎల్ లోలా ఆటగాళ్లను కొనుగోలు చేయమని, ముసాయిదా (డ్రాఫ్ట్) రూపంలో ఎంచుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News