: పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు... 144 సెక్షన్ విధింపు, నెలాఖరు వరకు సెక్షన్ 30 అమలు
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఆంక్షలు విధించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. నెలాఖరు వరకు సెక్షన్ 30 అమలు చేయనున్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. కాగా, మీడియా నియంత్రణపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, శాంతిభద్రతల దృష్ట్యా మీడియాను హ్యాండిల్ చేశామని, గతంలో తుని సంఘటనే గుర్తుందని, మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయనే మీడియాను నియంత్రించామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.