: హైదరాబాదులో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన స్వీడన్ సంస్థ


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కల సాకారం కానుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన మొత్తం తక్కువ అని పలు నిర్మాణ సంస్థలు వెనుకంజ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి స్వీడన్ సంస్థ 'm2 ఎమ్మెడ్యూ' ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఈ నెల 13న చర్చలు జరపనున్నారు. అయితే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన మొత్తాన్ని రూ. 7 లక్షలకు పెంచాలని మున్సిపల్ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

  • Loading...

More Telugu News