: పోలీసులపై దాడులు చేస్తున్న పొలిటీషియన్లకు విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరిక


ఈమధ్య కాలంలో పోలీసులపై చోటుచేసుకుంటున్న దాడులపై విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై కొంత మంది టీడీపీ నేతలు దాడులు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని వదిలేయమంటూ తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గేది లేదని, వారిని వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీ వారైనా విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. పోలీసులకు రక్షణ కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News