: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి ముద్రగడ... అత్యవసర వార్డులో వైద్యపరీక్షలు
కిర్లంపూడిలో అరెస్టు చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరెస్టు సమయంలో ముద్రగడ పురుగుల మందు తాగాడని వదంతులు వ్యాపించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యవసర వార్డులో ముద్రగడకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అన్ని వైద్యపరీక్షలకు ముద్రగడ సహకరించారని వైద్యులు తెలిపారు. కాగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.