: మోదీ రెండేళ్ల పాలనపై 'దోసాల్...జనతా బేహాల్' పుస్తకాన్ని విడుదల చేసిన సీపీఎం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై సీపీఎం పార్టీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. 'దోసాల్...జనతా బేహాల్' పేరిట రూపొందిన ఈ పుస్తకాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ పాలన రెండేళ్లలో కేవలం సంపన్నులకు మాత్రమే వికాస్ పర్వ్ దక్కిందని అన్నారు. మోదీ చర్యలతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశ భద్రతతో ముడిపడిన అంశాలను అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, మోదీ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా గుజరాత్ నుంచి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి ఎందుకు తరలించారని ఆయన నిలదీశారు.