: బీజేపీ, ఏబీవీపీ రెచ్చిపోతున్నాయి: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా బీజేపీ, ఏబీవీపీ ఆగడాలు శ్రుతిమించుతున్నాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంటే చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుంటే ప్రభుత్వ పతనం తప్పదని ఆయన హెచ్చరించారు.