: ముద్రగడ వ్యవహారం చిన్నపిల్లాడి అల్లరిలా ఉంది: చినరాజప్ప


కాపు ఐక్య ఉద్యమ వేదిక నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారం చిన్నపిల్లాడి అల్లరిలా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప మండిపడ్డారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దోషులను శిక్షించవద్దని ముద్రగడ కోరడం సముచితం కాదని ఆయన హితవు పలికారు. ముద్రగడ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తోందని, అలాంటప్పుడు వేచి చూడడం మాని ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం సరికాదని ఆయన సూచించారు. కాపుల ప్రయోజనాల కోసం పని చేయాలనుకుంటే కనుక, ఆయన ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించరని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News