: వంగవీటి రంగా, పరిటాల రవి హత్యానంతర అల్లర్లలో కూడా చాలా మందిపై కేసులు పెట్టారు: తోట త్రిమూర్తులు
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మండిపడ్డారు. తుని ఘటనకు బాధ్యులను అరెస్టు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ముద్రగడ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇటువంటి హామీలు ప్రభుత్వం ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. అమాయకులపై కేసులు పెట్టొద్దని మాత్రమే ముద్రగడ కోరారు తప్ప, ఈ ఘటనకు బాధ్యులను అరెస్ట్ చేయవద్దని ఆయన కోరలేదన్నారు. నాడు వంగవీటి రంగా, పరిటాల రవి హత్యలు జరిగినప్పుడు చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి పలువురిపై కేసులు పెట్టారని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు.