: ముద్రగడ, మంద కృష్ణలను అడ్డుపెట్టుకుని జగన్ రెచ్చిపోతున్నారు: మంత్రి రావెల
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగలను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతున్నారని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. వీళ్లిద్దరినీ అడ్డుపెట్టుకుని కులాలను రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారన్నారు. కాపులకు పూర్తి న్యాయం చేస్తున్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి అని ఆయన సూచించారు. ముద్రగడకు దమ్ముంటే కాపుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయ భిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీపై ముద్రగడ కక్ష కట్టారని రావెల విమర్శించారు.