: ఏపీలో తిరుపతి వెంకన్న ఉండటం అదృష్టమయితే, ఇదే రాష్ట్రంలో విపక్షనేతగా జగన్ ఉండటం దురదృష్టం!: కామినేని
మన రాష్ట్రంలో తిరుపతి వెంకన్న ఉండటం అదృష్టం అయితే, ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రాష్ట్రంలో ఉండటం చాలా దురదృష్టమంటూ ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడల్లా టీడీపీకి తాము అనుకూలంగా వ్యవహరించామనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఏపీలో ఇటీవల పర్యటించారన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని కామినేని చెప్పారు.