: ఏపీని తాకిన రుతుపవనాలు...నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చిరుజల్లులు
నైరుతి రుతపవనాలు ఏపీని తాకాయి. నిన్న ఉదయం కేరళను తాకిన రుతుపవనాలు ఏపీని తాకేందుకు రెండు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేయగా, చురుగ్గా కదిలిన రుతుపవనాలు నేటి మధ్యాహ్నం ఏపీని తాకాయి. దీంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రుతుపవనాల కారణంగా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో వర్షాలు కురువనున్నాయని అధికారులు ఇంతకుముందే తెలిపిన సంగతి తెలిసిందే.