: తప్పులు ఎత్తిచూపితే విమర్శలా..?: కోదండరాంపై విమర్శలను ఖండించిన పౌరహక్కుల నేత హరగోపాల్
తెలంగాణ ఉద్యమకారుడు, టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాంపై రాష్ట్ర మంత్రులు మూకుమ్ముడిగా విమర్శల దాడి చేస్తోన్న అంశంపై పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ స్పందించారు. ఆయనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పౌరహక్కుల సంఘం ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోదండరాం కేవలం పాలనలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపారని, వాటిని తిప్పి కొడుతూ టీఆర్ఎస్ నేతలు కోదండరాంపై విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కోదండరాం సూచించడాన్ని తిప్పికొడుతూ మంత్రులు చేస్తోన్న విమర్శలను ఆపుకోవాలని సూచించారు.