: ఈ ఏడాది రూ.1,63,538 కోట్లు రుణాలుగా ఇవ్వాలని బాంకర్ల నిర్ణ‌యం


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో బ్యాంకర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో ఈ ఏడాది రూ.1,63,538 కోట్లు రుణాలుగా ఇవ్వాలని బాంకర్లు నిర్ణ‌యించారు. వీటిల్లో వివిధ రంగాల‌కు కేటాయించాల్సిన నిధుల‌పై ప్ర‌ణాళికను రూపొందించిన బ్యాంక‌ర్లు ఈ అంశాన్ని చంద్ర‌బాబుకి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లెక్కల్లోని కేటాయింపులు ఆచరణలో కనిపించడం లేదని అన్నారు. స్మార్ట్‌ విలేజ్‌ ప్రాజెక్టు రిపోర్టు కోసం నాబార్డు రూ.500 కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. అయితే దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌బోద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అదే రూ.500 కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వానికి మంజూరు చేస్తే రాష్ట్రంలో స్మార్ట్ విలేజ్‌లు నిర్మించి చూపిస్తాన‌ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వ్య‌వ‌సాయ రంగానికి అధికంగా రుణాలు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా బ్యాంక‌ర్ల‌కు సూచించారు.

  • Loading...

More Telugu News